
Petrol Price: హైదరాబాద్ : చమురు సంస్థల ధరల పెంపు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. గురువారం పెంచిన ధరలతో దాదాపు రెండు రాష్ట్రాల్లో అన్ని లీటరు డీజిల్ ధర వంద రూపాయలను దాటేసింది. జూన్‌లోనే లీటరు పెట్రోలు ధర వందను దాటింది.
పెంపు ఇలా
పెట్రో వడ్డన కార్యక్రమం షురూ అయ్యింది. వరుసగా మూడో రోజు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర రూ. 107.36లకు పెరగగా డీజిల్ ధర 100.09లుగా నమోదు అయ్యింది. అక్టోబరు తొలి వారంలో ఏకంగా మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి.
మాటలకే పరిమితం
పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తామంటూ కేంద్రం ఫీలర్లు వదలడమే తప్ప ఆ దిశగా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలకు తగ్గిపోయే ఆదాయం, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడంలో కేంద్రం విఫలమవుతోంది. ఫలితంగా పెట్రోలు ధరల భారం సామాన్యులపై పడుతోంది.