పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్‌కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది.
ఈ ఏడాదిలో రూ.27
పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment