ఢిల్లీ : దేశంలో వరుసగా 21వ రోజు కూడా పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.38 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.40 రూపాయలకు చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్‌పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్‌పై 9.18 రూపాయలు పెరిగాయి. లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్ 7 నుంచి దేశంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్ 1న లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 80.33 రూపాయలకు చేరింది. కరోనా నేపథ్యంలో రోజురోజుకు పెట్రో, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజైన శుక్రవారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచిన సంగతి తెలిసిందే.
21వ రోజు.. ఆగని పెట్రో, డీజిల్ ధరలు
Published Sat, Jun 27 2020 8:32 AM | Last Updated on Sat, Jun 27 2020 10:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment