ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.
గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ర్యాన్సమ్‌వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ
దేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment