
లీటరుకు రూపాయి తగ్గిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూపాయి తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గించిన ధర మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్ ధర తగ్గించడం ఈనెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న లీటర్ పెట్రోల్ ధరపై 54 పైసలు తగ్గింది.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.65కు, ముంబైలో రూ.74.46 చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి.