న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ రేటు తగ్గే అవకాశం కనిపిస్తోంది. రూ.1.50-2 మేరకు పెట్రోల్ ధర తగ్గవచ్చని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయవచ్చని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా పడిపోతుండటంతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుతాయడానికిది సంకేతమ’ని ఆయిల్ కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.