రూ. 30కే లీటర్ పెట్రోల్! | 1 leter per 30 rupee | Sakshi
Sakshi News home page

రూ. 30కే లీటర్ పెట్రోల్!

Published Wed, Feb 4 2015 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రూ. 30కే లీటర్ పెట్రోల్! - Sakshi

రూ. 30కే లీటర్ పెట్రోల్!

పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్
కోలారులో వినూత్నంగా నిరసన తెలిపిన వైనం


 కోలారు : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడంపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 30కే లీటర్ పెట్రోల్ చొప్పున మంగళవారం విక్రయాలు సాగించి కోలారులో నిరసన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆందోళన కారులు మాట్లాడుతూ... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించక పోతే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్ షహజాద్, అజంపాషా, ప్రతాప్, మంజునాథ్, వెంకటస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, రూ. 30కే లీటర్ పెట్రోల్ ఇస్తున్నట్లు తెలుసుకున్న వాహనదారులు ఆందోళన శిబిరం వద్ద బారులు తీరారు. అయితే నిరసన తెలిపేందుకు 30 లీటర్ల పెట్రోల్‌ను మాత్రమే తీసుకురావడంతో వాహనదారుల్లో నిరాశ వ్యక్తమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement