తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ.1.12 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.24పైసలు ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువకు అనుగుణంగా ఈ ధరలను తగ్గించినట్టు తెలిసింది. కాగ, రోజువారీగా సవరించనున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై పెట్రోల్ డీలర్లు కూడా సమ్మతించారు.
ధరలను ప్రతిరోజూ అర్థరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో ముందుగా నిర్ణయించిన బంద్ ను కూడా పెట్రో డీలర్లు ఉపసంహరించుకున్నారు. రేపటి నుంచే రోజువారీ ధరల మార్పు ఉండనుంది. కానీ ఒక్క రోజే ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించడం విశేషం. ఇవి కూడా నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.