
వాహనదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీజిల్ లీటర్ ధర రూ. 2.50, పెట్రోల్ లీటర్ ధుర ఒక రూపాయి తగ్గే అవకాశం ఉంది. వాహనదారులకు ఇది శుభవార్తే. అయితే అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
గత ఏడాది జనవరిలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ పెట్రోల్ ధరలను నెలకు 40 నుంచి 50 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రతి నెలా డీజిల్ ధర పెరుగుతోంది. అయితే డీజిల్ అమ్మకాలు లాభాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది.
**