హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి-డాలర్ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు మార్పులు చేస్తారు. దేశంలోని ఇతర నగరాలలో కొత్త ఇంధన రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: పది ఏళ్లుగా ముఖేష్ అంబానీ నెంబర్ 1)
Comments
Please login to add a commentAdd a comment