పెట్రోల్: 75పైసలు, డీజిల్: 50పైసలు పెరిగాయ్
స్థానిక పన్నులు అదనం.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: రెండురోజుల క్రితం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.215 మేరకు పెంచి వినియోగదారులపై పెనుభారం మోపిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడం ద్వారా ఇంకో షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నారుు. పెట్రోల్ ధరను లీటర్‌కు 75 పైసలు, డీజిల్ ధరను లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచుతున్నట్టు తెలిపారుు. వీటికి స్థానిక పన్నులు లేదా వ్యాట్ అదనంగా తోడవుతుంది. దీంతో పెంపులో ప్రాంతాలవారీగా వ్యత్యాసం ఉంటుంది. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆరుుల్ కంపెనీ (ఐఓసీ) తెలిపింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రూపారుు విలువ క్షీణత.. పెరుగుదలకు కారణంగా పేర్కొంది. చివరిసారిగా డిసెంబర్ 21న పెట్రోల్ ధర లీటర్‌కు 41 పైసలు మేరకు (పన్నులు అదనం) పెరిగింది. పెట్రోల్ పంప్ డీలర్లకు చెల్లించే కమీషన్‌ను ప్రభుత్వం పెంచడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. డీజిల్ ధర 10 పైసల మేరకు పెరిగింది. గత జనవరి మొదలుకుని ఈ ఏడాదిలో డీజిల్ ధర రూ.7.19 మేరకు పెరిగింది. చమురు కంపెనీలకు వాటిల్లుతున్న నష్టం భర్తీ అయ్యేవరకు ప్రతి నెలా 50 పైసల చొప్పున డీ జిల్ రేటు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం (2013 జనవరి)లో భాగంగానే ప్రస్తుత పెంపుదల చోటు చేసుకుంది. 2013 జనవరి మొదలుకుని ఇప్పటివరకు 12 సార్లు ధర పెరిగినా చమురు కంపెనీలు ఇప్పటికీ లీటర్ డీజిల్ విక్రయంపై కంపెనీలకు రూ.9.24 చొప్పున నష్టం వాటిల్లుతూనే ఉందని దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ అరుున ఐఓసీ తన ప్రకటనలో వివరించింది.
అలాగే లీటర్ కిరోసిన్ విక్రయంపై రూ.37.33, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.762.50 మేరకు నష్టం వాటిల్లుతోందని తెలిపింది. వాస్తవానికి జనవరి 1నే ధరలు సవరించాల్సి ఉన్నప్పటికీ.. వినియోగదారులు ‘కొత్త సంవత్సర కానుక’గా భావిస్తారనే ఉద్దేశంతో చమురు కంపెనీలు ధరల సవరణకు పూనుకోలేదని అధికారులు పేర్కొన్నారు. చివరిసారి ధర మార్పు తర్వాత అంతర్జాతీయంగా గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు బ్యారెల్‌కు 115 అమెరికన్ డాలర్ల నుంచి 116.6 అమెరికన్ డాలర్లకు ఎగబాకాయని, మరోవైపు డాలర్‌తో రూపారుు మారకం విలువ క్షీణించిందని ఐఓసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయూలు, ఆర్థికపరమైన పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరల్లో నిరంతర మార్పులు చోటు చేసుకుంటున్నట్టు తెలిపింది.