ఢిల్లీ: పెట్రో ధరలు దేశవ్యాప్తంగా మంట పుట్టిస్తున్నాయి. అయితే.. దీనికి పరిష్కారం ఉందని, అలా చేస్తే గనుక పెట్రోల్ ధర పాతాళానికి దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అదే సమయంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ ప్రధాన సమస్య కూడా లేకుండా పోతుందట!.
పెట్రోలు ధరను లీటరుకు రూ. 15కే దొరికే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వినూత్న ప్రతిపాదన చేశారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో గడ్కరీ మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇథనాల్,ఎలక్ట్రిసిటీ మిశ్రమాలను ఉపయోగించడం వల్ల పెట్రోల్ ధరలు వాటంతట అవే దిగి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం, తన ప్రధాన అభిమతం రైతులను ‘‘ఉర్జాదాత’’(శక్తి ప్రదాతలు)గా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారాయన.
మన రైతులు అన్నదాతలే కాదు.. ఉర్జాదాతలు కూడా అనే ధోరణితో మా ఈ ప్రభుత్వం ఉంది. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో వాహనాలన్నీ గనుక నడిస్తే ప్రయోజనం ఉంటుంది. సగటున 60% ఇథనాల్- 40% విద్యుత్ తీసుకుంటే.. అప్పుడు పెట్రోల్ లీటరుకు ₹ 15 చొప్పున అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారాయన.
తద్వారా ప్రపంచాన్ని పీడిస్తున్న కాలుష్యం తగ్గుతుందని, పెట్రో దిగుమతుల కోసం ఖర్చయ్యే 16 లక్షల కోట్ల రూపాయలు.. రైతుల ఖాతాల్లోకి మళ్లి వాళ్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారాయన.
#WATCH | Pratapgarh, Rajasthan | Union Minister Nitin Gadkari says, "Our government is of the mindset that the farmers become not only 'annadata' but also 'urjadata'...All the vehicles will now run on ethanol produced by farmers. If an average of 60% ethanol and 40% electricity… pic.twitter.com/RGBP7do5Ka
— ANI (@ANI) July 5, 2023
ఇదీ చదవండి: 'స్టార్లను తయారుచేసేది టీచర్లే కదా'
Comments
Please login to add a commentAdd a comment