వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం
దూలపల్లి: పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి హెచ్చరించారు. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సూరారం సాయిబాబానగర్ చౌరస్తా వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి దహనం చేశారు.
ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెల రోజుల్లో రెండు సార్లు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ఒక పక్క పేదలకు లబ్ధి చేకూరే పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాట్రెడ్డి రమణారెడ్డి, మీసాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, విద్యార్థి విభాగం నేత విశ్వనాథ, శివగౌడ్, నరేందర్‌రెడ్డి, శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
‘పెట్రో’ పెంపుపై ఆందోళన
Published Mon, May 18 2015 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement