పెట్రోల్‌పై రూ.3.78 పెంపు
చెన్నై :
తమిళనాడులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ 3.78, డీజిల్‌పై రూ 1.70 పెరిగాయి. పెట్రోల్, డిజిల్‌పై తమిళనాడు ప్రభుత్వం వ్యాట్(వ్యాల్యూ ఆడెడ్ ట్యాక్స్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుపై తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్రోల్, డిజిల్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్రప్రభావం పడుతుందని, తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 34 శాతానికి పెంచగా, డీజిల్‌పై 21.4 శాతం ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచారని అసోసియేషన్ ప్రెసిడెంట్ కే.పీ మురళి పేర్కొన్నారు. ధరలపెంపుతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
తమిళనాడులో పెంచిన వ్యాట్‌తో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75కు చేరింది.