
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి.
మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment