న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదల ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని... 18 రోజులు పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు తర్వాత రోజువారీగా వడ్డిస్తున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. బోఫాల్‌లో లీటరు పెట్రోల్ రూ.100.08 ఉండగా ఇండోర్‌లో రూ.100.16 చేరింది.
ఇక రాజస్తాన్‌లోని. శ్రీగంగానగర్‌లో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.95.89గా ఉంది. నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.95.67, డీజిల్ ధర రూ.90.06గా ఉంది.
చదవండి:
టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment