పెట్రోలు, డీజిల్ ధరల పెంపు నిలిపివేత!
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలపై బుధవారం జరగాల్సిన సమీక్షను ప్రభుత్వ సూచనల మేరకు చమురు కంపెనీలు వాయిదా వేసినట్టు తెలిసింది. ఏప్రిల్ 1, 15న నిర్వహించిన సమీక్షల్లో పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించిన విషయం తెలిసిందే.
అయితే, కొన్ని రోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న క్రమంలో లీటరు పెట్రోలుకు 40 నుంచి 50 పైసలు పెంచాలని పెట్రోలియం కంపెనీలు నిర్ణయించాయి. అదేవిధంగా డీజిల్ ధరను కూడా పెంచాలని కంపెనీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే, ఎన్నికలు జరుగుతున్నందున ధరలను పెంచితే వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు పెంపును వాయిదా వేయానిలని కోరింది.