పెట్రోల్‌ ధరలు.. నిర్మాత ట్వీట్‌పై జోకులు | Ekta Kapoor Confusing Answer On Petrol Price Hike | Sakshi
Sakshi News home page

Published Thu, May 24 2018 7:18 PM | Last Updated on Thu, May 24 2018 7:56 PM

Ekta Kapoor Confusing Answer On Petrol Price Hike - Sakshi

ఏక్తా కపూర్‌ (ఫైల్‌ ఫొటో)

బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ చేసిన వ్యాఖ్యలపై జోకులు పేలుస్తూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. పెట్రోల్‌ ధరలు పెరగడంపై ఏక్తా కపూర్‌ చేసిన వ్యాఖ్యల అంతరార్థమేమిటో అర్థం కాకపోవడమే ఇందుకు కారణం. ‘వీరే ది వెడ్డింగ్‌’  సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఏక్తా.. ‘ ఒకవేళ పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అబ్బాయిలు అమ్మాయిలను లాంగ్‌డ్రైవ్స్‌కి తీసుకెళ్తారు. ఈరోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలను డ్రైవ్‌కి తీసుకెళ్తున్నారు. అయిపోవటానికి ఇదేం సినిమా కాదు. కాబట్టి, మీరు మీ డ్రైవింగ్‌పై తక్కువ ఖర్చు చేయండి. థియేటర్లలో ఎక్కువ సమయం ఉండండి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఏక్తా కపూర్‌ వ్యాఖ్యలను ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. ‘ఏక్తా లాజిక్‌ ఆమె నిర్మించే సీరియళ్లలాగే ఇంకా బేస్‌మెంట్‌ లెవల్‌లోనే ఉందంటూ’  ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. ‘ఒకవేళ భవిష్యత్తులో ఆహారం ధరలు పెరిగితే.. అదేమీ స్కూలు ఫీజు కాదు కట్టకుండా ఉండటానికి.. పిల్లల చదువుకు తక్కువ ఖర్చు చేయండి.. ఆహారం కోసం ఎక్కువ డబ్బు వెచ్చించండి’  అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్‌ చేశారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఇలాంటి లాజిక్‌లేని వ్యాఖ్యలు చేసి ఏక్తా కపూర్‌ నెటిజన్ల చేతికి చిక్కారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement