ఏక్తా కపూర్, శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల వస్తున్న పుకార్లపై బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఘటుగా స్పందించారు. శ్రీదేవి సర్జరీ కారణంగానే మృతి చెందిందని, సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చిందంటూ సోషల్‌మీడియా, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో లేనివి, ఉన్నవి కల్పిస్తూ అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె సూచించారు.
‘చెడ్డ వాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధుల్లేకుండా, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారిలో 1శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పరిశోధకులు తెలిపారని ఓ డాక్టర్ నాకు చెప్పారు. ఇది విధి రాత.. ఉన్నవి లేనివి కల్పిస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని ట్వీట్ చేశారు.
శనివారం రాత్రి దుబాయ్‌లో నటి శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె పార్దీవ దేహం తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.
Evil ones pls realise one percent ( as fwded as my doc told me) of the population can have an cardiac arrest without any heart condition or any kind of surgery ! It’s destiny not how evil rumour mongers portray!!!
— Ekta Kapoor (@ektaravikapoor) 25 February 2018
Comments
Please login to add a commentAdd a comment