శుక్రవారం రోజు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు.
రవాణా రంగం మీద ఆధారపడే వాళ్లు సైతం బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.కానీ రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్‌కు వెళ్లాలంటే జంకుతున్నారు.
దేశంలోని పలు నగరాల్లో రోజురోజుకి పెరగుతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్ రేటు వంద దాటి పరుగులుపెడుతుండగా.. డీజల్ రేట్లు సైతం వంద మార్క్‌ను దాటాయి.
పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.107.71 ఉండగా డీజిల్ లీటర్ రూ.100.51 ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 92.12 ఉంది
ముంబైలో పెట్రోల్ రూ. 109.54 ఉండగా డీజిల్ రూ .99.92 ఉంది
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.23 ఉండగా డీజిల్ రూ. 95.23 ఉంది
చెన్నైలో పెట్రోల్ రూ .101.01 డీజిల్ రూ. 96.60 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment