International oil prices
-
భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి
న్యూఢిల్లీ: భారత్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ అవకాశాలను సొంతం చేసుకోవాలంటూ అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వనం పలికారు. చమురు, గ్యాస్ రంగంలో అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలకు భారత్‌తో చేతులు కలపాలని కోరారు. అంతర్జాతీయ చమురు కంపెనీల సీఈవోలు, ఈ రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇంధన వనరుల పెంపు, అందుబాటు ధరలు, ఇంధన భద్రత దిశగా భారత్ చేపట్టిన చర్యలను పరిశ్రమకు చెందిన వారు మెచ్చుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి వారికి ప్రధాని వివరంగా తెలియజేసినట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలియజేసినట్టు.. ముడి చమురు నిల్వ సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రస్తావించినట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న గ్యాస్ అవసరాలను తీర్చేందుకు వీలుగా గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, పట్టణ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు చర్యలను వారికి తెలియజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. రవాణా రంగం మీద ఆధారపడే వాళ్లు సైతం బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.కానీ రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో రోజురోజుకి పెరగుతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్ రేటు వంద దాటి పరుగులుపెడుతుండగా.. డీజల్ రేట్లు సైతం వంద మార్క్‌ను దాటాయి. పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.107.71 ఉండగా డీజిల్ లీటర్ రూ.100.51 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 92.12 ఉంది ముంబైలో పెట్రోల్ రూ. 109.54 ఉండగా డీజిల్ రూ .99.92 ఉంది కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.23 ఉండగా డీజిల్ రూ. 95.23 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ .101.01 డీజిల్ రూ. 96.60 ఉంది. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పన్నెండు రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాహనదారులకు మరోసారి ఇక్కట్లు మొదలుకానున్నాయి. పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల ఇంధన రిటైల్ విక్రయ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ భారీగా పెరిగిన బారెల్ ధరలు...! అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆగస్టు సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 4-6 డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలపై ఇప్పటివరకు చమురు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఇదే స్థాయిలో ఉంటే..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చివరగా ఈ ఏడాది జూలై 15, 17 తేదిల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్, డిజీల్ ధరలు వరుసగా రూ.101.19, రూ. 88.62 గా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే సగటు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆగస్టులో బ్యారెల్‌కు మూడు డాలర్లకంటే తక్కువగా నమోదయ్యాయి. యుఎస్, చైనా మిశ్రమ ఆర్థిక డేటా, వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ కారణంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రకారం, జూలై 18 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ రిటైల్ ధరలను వరుసగా లీటరుకు రూ. 0.65,రూ. 1.25 కు తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాలతో ముడి చమురు ధరలు ఆగస్టు చివరి వారం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
వంట గ్యాస్‌పై 50 పెంపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగని పెట్రో మంట న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్‌లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది. -
ఏడాది కనిష్టానికి ‘పెట్రోల్’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరింత తగ్గాయి. పెట్రోల్ లీటర్‌కు 22 పైసలు తగ్గడంతో దేశ రాజధానిలో రూ.69.26 నుంచి ఈ ఏడాదిలోనే కనిష్ట స్థాయి రూ.69.04కు చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటరుపై 23 పైసలు తగ్గడంతో రూ.63.32 నుంచి తొమ్మిది నెలల కనిష్ట స్థాయి రూ.63.09కి దిగి వచ్చిందని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో పెట్రో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడించాయి. ఆగస్టు 15వ తేదీన పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.14, ముంబైలో రూ.84.58, డీజిల్ లీటర్ ఢిల్లీలో రూ.68.72, ముంబైలో రూ.72.96గా ఉండగా 16వ తేదీ నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించి, అక్టోబర్ 4వ తేదీన రికార్డు స్థాయికి ఢిల్లీలో రూ.91.34, ముంబైలో రూ.84కు చేరుకుంది. అదే రోజు డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటర్‌కు రూ.75.45, ముంబైలో రూ.80.10కు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గడంతో ఆ ప్రభావం దేశీయంగా పడింది. హైదరాబాద్‌లో..: ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.73.22కు చేరింది. అక్టోబరులో రూ.89.06 ధరతో రికార్డు సృష్టించిన పెట్రోల్ ధర నవంబర్ నాటికి రూ.84.14కు చేరింది. డిసెంబర్ మొదటివారంలో రూ.76.89 ఉన్న ధర చివరి వారంలో మరో రూ.3.67 తగ్గడం విశేషం. డీజిల్ ధర లీటరుకు ప్రస్తుతం రూ.68.67కు చేరింది. అక్టోబర్‌లో లీటరు డీజిల్ ధర రూ.82.33 కాగా, నవంబర్ నెలలో 80.20కు చేరింది. -
పెట్రో మంటలు
నర్సంపేట (వరంగల్) : ఆయిల్ కంపెనీలు పెట్రో, డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతుండడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు తడిసి మోపెడవుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు నిత్యావసర సరకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 24 గంటలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరిచేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన పాలకులు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో ఎలా బతకాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ధరలు ఆటోడ్రైవర్లతోపాటు ఆర్టీసీ, ఇతర ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. రవాణా చార్జీలు పెంచలేక.. ఆటో, ఇతర వాహనాలు నడిపించడం మానలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రోజువారి సంపాదనపై ఆధారపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోవాలాలు లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పది ట్రిప్పులు రవాణా చేసినా.. పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో ట్రాన్స్పోర్ట్ చార్జీలు తడిసిమోపడై నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సామాన్యులు ఆం దోళన చెందుతున్నారు. రోజు రూ.60 లక్షలకుపైగా భారం జిల్లావ్యాప్తంగా 43 పెట్రోల్ బంకులు ఉండగా.. పెరుగుతున్న ధరలతో జిల్లావాసులపై రోజుకు రూ.60 లక్షలకుపైగానే అదనపు భారం పడుతోంది. సెప్టెంబర్ ఆరంభంలోనే పెట్రోల్ లీటర్‌కు 50 పైసలు పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. 2018 ఫిబ్రవరి నుం చి ఇప్పటి వరకు లీటరు డీజిల్‌పై రూ.9.87, పెట్రోల్‌పై రూ.8.19 పైసలు పెరిగింది. ఏడు నెలల కాలంలోనే లీటర్ ధర రూ.10 వరకు పెరుగుతూ సామాన్యులను కంగారు పెట్టిస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడడమేగాక పెట్రోల్ బంకు యజమానులు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడం ఖాయంగా కనిపిస్తోంది. ధరల పెంపు మోయలేని భారం సామాన్య ప్రజలు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిన తరుణంలో పెట్రోలు ధరలు మోయలేని భారంగా మారాయి. సామాన్యుల అవసరాలను గుర్తెరిగి వీలైనంత వరకు ధరలను తగ్గించి ఆదుకోవాలి. శ్రీలత, ఉపాధ్యాయురాలు ఆదాయం సగం పడిపోయింది.. మేము గతంలో రోజంతా ఆటో నడిపితే రూ.600 లాభం ఉండేది. ఈ మధ్య పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలతో ఆదాయం 300కు పడిపోయింది. మళ్లీ డీజీల్ ధరలు పెరుగుతాయని తెలుస్తాంది. ఇట్లయితే వచ్చే రోజుల్లో ఆటో నడుపుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది. –కారోజు నగేష్, ఆటో డ్రైవర్ -
ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?
ఇరాన్ ఆరు ప్రపంచ దిగ్గజ దేశాలు- అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలతో మంగళవారం చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెహ్రాన్ అణు కార్యక్రమంసహా పలు అంశాలపై ఆంక్షలు సడలించే అవకాశాలకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఒప్పందం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. అసలు ఈ ఒప్పందం వల్ల భారత్‌కు వచ్చే లాభనష్టాలు ఏమిటన్న అంశంపై దృష్టి సారిస్తే... ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు ధరలు డాలర్‌కుపైగా పడిపోయాయి. క్రూడ్ భారీ దిగుమతుల దేశంగా భారత్‌కు ఈ వార్త ఎంత సానుకూలమో వేరే చెప్పనక్కర్లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు లాభించే అంశం ఇది. అయితే ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా వంటి చమురు అన్వేషణ కంపెనీలకు ప్రతికూలమే.జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఒప్పందం ‘తటస్థ’ ఫలితాన్ని ఇస్తుంది. ►భారత్ అతిపెద్ద ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అబాన్ ఆఫ్‌షోర్ తన మొత్తం ఆదాయంలో 35% ఇరాన్ నుంచి పొందుతోంది. ఇది కంపెనీకి లాభించే అంశం. ఇరాన్లో ఆంక్షల సడలింపు కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ►ఇరాన్ ఫజార్డ్ బీ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ఇన్ఫ్రా ప్రాజెక్టులను భారత్ దక్కించుకోవాలని చూస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు ఈ ప్రాజెక్టును తన్నుకుపోతే పరిస్థితి ఏమిటని చమురు మంత్రిత్వశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ► ఆంక్షల సడలింపు జరిగి, ఇతర దేశాలతో ఇరాన్ సరళతరంగా వ్యాపారం చేయగలిగితే- తక్కువ ధరకు ఇరాన్ నుంచి భారత రిఫైనరీలుకు చమురు సరఫరా జరక్కపోవచ్చు. పైగా ఇప్పటివరకూ ఆంక్షల వల్ల చెల్లించే పరిస్థితి లేని దాదాపు 6.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40.000 కోట్లు) హార్డ్ కరెన్సీలో తక్షణం చెల్లించాల్సిన పరిస్థితి భారత్ రిఫైనరీలకు ఉత్పన్నమవుతుంది. ► వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం, ఆంక్షల సడలింపు భారత్ ఫార్మా, ఐటీ, కమోడిటీ రంగాలకు కలిసివచ్చే అంశం. ఇరాన్లో ప్రత్యక్ష కాంట్రాక్టులకు ఆయా రంగాల కంపెనీలకు వీలవుతుంది. ► బాస్మతి బియ్యం, సోయామీల్, చక్కెర, బార్లీ, మాంసం వంటి వాటిని ఇరాన్ దేశం మన నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది. ఆంక్షల వల్ల ఈ కమోడిటీల కొనుగోలుకు ఇరాన్ 20% ప్రీమియం చెల్లిస్తోంది. ఆంక్షలు తొలగితే ఈ ప్రీమియంలను భారత కంపెనీలు కోల్పోతాయి. ► ఇరాన్‌కు ఎగుమతులకు సంబంధించి ఆ మార్కెట్లో ఇక భారత్ ఎగుమతిదారులు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దుస్తుల నుంచి కార్ల వరకూ వివిధ వినియోగ ప్రొడక్టుల అమ్మకాలపై భారత్ కంపెనీలు పోటీని ఎదుర్కోవాలి. ఇరాన్ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి అమెరికా సహా ఆరు సంపన్న దేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో.. ఆ దేశంలో గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) ఇక్కడ 2008లో కనుగొన్న భారీ గ్యాస్ క్షేత్రం ఫర్జాద్-బికి సంబంధించి అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌కు విజ్ఞప్తి చేయనుంది. ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఓఎన్జీసీ విదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. ఇక్కడ 12.8 లక్షల కోట్ల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇరాన్‌పై ఆంక్షలు తొలగుతున్న నేపథ్యంలో ఈ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె. వర్మ చెప్పారు. కాగా, ఇరాన్‌పై ఆంక్షలు తొలగనుండటంతో అక్కడి నుంచి భారత్ ముడి చమురును కూడా ఇక పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుందని భారత చమురు రిఫైనరీలు ఆశిస్తున్నాయి. మరోపక్క, అణు ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌కు చెల్లించాల్సిన 6.5 బిలియన్ డాలర్ల ముడి చమురు(క్రూడ్) దిగుమతి బిల్లు బకాయిలను భారతీయ రిఫైనరీలు చెల్లించాల్సి ఉంటుందని చమురు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
ఈ హెచ్చుతగ్గుల కాలంలో.. ‘బ్యాలెన్స్డ్’గా ఉండాల్సిందే
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయ చమురు ధరలతో పాటు దేశీయ ద్రవ్యోల్బణం తగ్గటం, ద్రవ్య లోటుకు కళ్లెం వేయటం, నిరర్థక రుణాలు పెరగకపోవటం వంటివ న్నీ స్థూలంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందనే సంకేతాలిస్తున్నాయి. దీంతో వచ్చే నాలుగైదేళ్లలో వృద్ధి రేటు మెరుగుపడటం తప్పనిసరి. మరి ఆ వృద్ధి స్టాక్ మార్కెట్ విలువల్లోనూ ప్రతిఫలి స్తుంది కదా!! కొన్నాళ్లుగా చూస్తే మార్కెట్లు భారీగా పెరుగుతూ... అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. నిజానికి ఏ మార్కెట్టూ నేరుగా పెరిగిపోదు. అయితే కంపెనీల ఆదాయాలు తగ్గుతున్నా మార్కెట్లో ఆ మేరకు కరెక్షన్ రాలేదు. కాబట్టి కరెక్షన్ అనూహ్యమేమీ కాదు. మార్కెట్లో పెట్టుబడులకు అవకాశమిచ్చేది కూడా ఈ కరెక్షన్లే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం... దాన్ని మార్కెట్లు దిగమింగుకోవటం జరిగేదాకా ఈ హెచ్చుతగ్గులుంటాయి. కాబట్టి తమ వాటాలు పెంచుకోవాలనుకునేవాళ్లకు అవకాశం వచ్చినట్లే. పరిమితమైన రాబడులు ఆశిస్తూ దీర్ఘకాలిక దృష్టితో మన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికైతే ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే సెన్సెక్ ప్రస్తుతం 15.9 ఫార్వార్డ్ పీఈ (ప్రైస్ ఎర్నింగ్స్ నిష్పత్తి) వద్ద ట్రేడవుతోంది. ఇది చారిత్రక సగటుకు దాదాపు సమానం. దీనర్థం మార్కెట్లు సరైన విలువ వద్దే ఉన్నట్లు. ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు తగ్గటం, వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో డెట్ మార్కెట్లూ బాగుంటాయి. ఇలాంటపుడు ఇన్వెస్టర్లు వారి రిస్క్ సామర్థ్యం మేరకు అటు డెట్, ఇటు షేర్లు రెండింటా పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలానికిదే మంచి వ్యూహం. ఇలా పెట్టడానికి చక్కని మార్గం బ్యాలెన్స్డ్ ఫండ్సే. వీటితో డెట్-ఈక్విటీల్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలన్నది ముందే నిర్ణయించుకోవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లలోని లాభాలూ మిస్ కావు. డెట్‌లోని స్థిరత్వాన్నీ వదులుకోవాల్సిన పనిలేదు. పెపైచ్చు స్టాక్ మార్కెట్ల గమనాన్ని బట్టి ఈక్విటీ కేటాయింపుల్ని, వడ్డీ రేట్లను బట్టి డెట్ కేటాయింపుల్ని మార్చుకోవచ్చు. అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా... సంప్రదాయ ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి మార్కెట్లు చౌకగా ఉన్నపుడు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి... పెరగ్గానే లాభాలతో బయటికొస్తాయి. దీంతో రిస్క్ తక్కువ... దీర్ఘకాలంలో రాబడి ఎక్కువ. ఇన్వెస్టర్లకు ఇవి నిధుల కేటాయింపు టూల్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌తో పన్ను లాభాలూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫండ్లు 65 శాతం వరకూ నిధుల్ని ఈక్విటీలోనే పెడుతున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌కు మల్లే దీనిపై పన్నులుంటాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ సమయం ఏడాది దాటితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. ఏడాది లోగా విత్‌డ్రా చేసుకుంటే మాత్రం పన్ను వర్తిస్తుంది. ఇక వీటిపై ఇచ్చే డివిడెండుకూ పన్ను వర్తించదు. తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారికి, పెద్దగా రిస్క్‌ను ఇష్టపడని వారికి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లు ఉత్తమమని చెప్పాలి. తక్కువ ఒడిదుడుకులు, పన్ను లాభాలు అనే వారికి నచ్చే అంశాలు. ఇలాంటి ఫండ్లలో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులకు అతీతంగా మంచి లాభాలొస్తాయనేది స్పష్టం.