శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది
► ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా డీజిల్ ధర రూ. 97.84 ఉంది
► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.106కి చేరింది, లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08 ఉంది
► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.06కి పెరిగి రూ.108.67కి చేరింది, లీటర్ డీజిల్ ధర రూ.1.06 పెరిగి రూ.100.39కు ఉంది
► వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధరపై 0.82పైసలు పెరిగి రూ.107.51కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.99.28 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment