Kho Kho competitions
-
ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్
భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్షిప్ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్షిప్లకు కోసం చూస్తోంది.ఖో-ఖో ప్రపంచకప్కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్‌ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.స్పాన్సర్ షిప్లుఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్‌లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్‌నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్‌వర్క్‌ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్క్రికెట్లో ఐపీఎల్, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్‌గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. -
సత్తా చాటారు!
కీసర, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీట్లో జిల్లా జట్లు సత్తా చాటాయి. బాలురు, బాలికల విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. కీసరలోని సెరిని టీ పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్విహ ం చిన 59వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో నిజామాబా ద్ జిల్లా జట్టు ద్వితీయ, మహబూబ్‌నగర్ జట్టు తృతీయ, నల్గొండ నాలుగో స్థానంలో నిలిచా యి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో నిజామాబాద్ జిల్లా జట్టు, తృతీయ స్థానంలో ఆదిలాబాద్ జట్టు, నాలుగో స్థానంలో వరంగల్ జట్టు నిలిచిందని క్రీడా పోటీల ఇన్చార్జి రమేష్‌రెడ్డి తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే కేఎల్లార్ బహుమతులు ప్రదానం చేశా రు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, క్రీడల్లో రాణించే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్సూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీలు వేదికగా నిలిచాయన్నారు. పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్లు బాలికలు, బాలుర విభాగాల్లో మొదటిస్థానాల్లో నిలవడం అభినందించదగిన విషయమన్నారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాలకుగాను ప్రకాశం జిల్లా తప్ప మిగిలిన 22 జిల్లాల జట్లు పాల్గొన్నాయన్నారు. బాలికలు, బాలుర విభాగాల్లో మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని, 130 మంది వ్యాయామ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఇన్ చార్జి రమేష్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉప సర్పంచ్ రాయిల శ్రావణ్‌కుమార్ గుప్తా, కీసరగుట్ట కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్, పన్నాల బుచ్చిరెడ్డి, రమేష్ గుప్తా, జంగయ్య యాదవ్, భానుశర్మ, శివగౌడ్ పాల్గొన్నారు.