కీసర, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీట్లో జిల్లా జట్లు సత్తా చాటాయి. బాలురు, బాలికల విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. కీసరలోని సెరిని టీ పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్విహ ం చిన 59వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో నిజామాబా ద్ జిల్లా జట్టు ద్వితీయ, మహబూబ్‌నగర్ జట్టు తృతీయ, నల్గొండ నాలుగో స్థానంలో నిలిచా యి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో నిజామాబాద్ జిల్లా జట్టు, తృతీయ స్థానంలో ఆదిలాబాద్ జట్టు, నాలుగో స్థానంలో వరంగల్ జట్టు నిలిచిందని క్రీడా పోటీల ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే కేఎల్లార్ బహుమతులు ప్రదానం చేశా రు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, క్రీడల్లో రాణించే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్సూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీలు వేదికగా నిలిచాయన్నారు.
పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్లు బాలికలు, బాలుర విభాగాల్లో మొదటిస్థానాల్లో నిలవడం అభినందించదగిన విషయమన్నారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాలకుగాను ప్రకాశం జిల్లా తప్ప మిగిలిన 22 జిల్లాల జట్లు పాల్గొన్నాయన్నారు. బాలికలు, బాలుర విభాగాల్లో మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని, 130 మంది వ్యాయామ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారని చెప్పారు.
కార్యక్రమంలో టోర్నమెంట్ ఇన్ చార్జి రమేష్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉప సర్పంచ్ రాయిల శ్రావణ్‌కుమార్ గుప్తా, కీసరగుట్ట కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్, పన్నాల బుచ్చిరెడ్డి, రమేష్ గుప్తా, జంగయ్య యాదవ్, భానుశర్మ, శివగౌడ్ పాల్గొన్నారు.
సత్తా చాటారు!
Published Mon, Nov 11 2013 2:25 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM
Advertisement
Advertisement