సాక్షి, హైదరాబాద్: జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్లు మణిపూర్‌లోని తౌబాల్ నగరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే జాతీయ ఖో–ఖో టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. బాలబాలికల జట్లకు కోచ్‌గా ఎన్. కష్ణమూర్తి, మేనేజర్‌గా గోపాల్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో తెలంగాణ జట్లు రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఖో–ఖో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఉమ్మడి కార్యదర్శి కె. రామకష్ణ, కోశాధికారి ఎన్. కష్ణమూర్తి, మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జట్ల వివరాలు
బాలురు: బి. మహేశ్, బి. సోమరాజు, జగతిబాబు, అశోక్ (రంగారెడ్డి), బి. ప్రవీణ్, మాజిద్ పాషా, డి. వినయ్ (వరంగల్), బి. రమేశ్, కె. రమేశ్(ఆదిలాబాద్), నరసింహస్వామి, ధీరజ్ (హైదరాబాద్).
బాలికలు: బి. రేణుక, కె. అనూష (రంగారెడ్డి), ఎ. సంధ్య, పొనిక, శిరీష (వరంగల్), స్రవంతి, మహేశ్వరి (హైదరాబాద్), సి. కారుణ్య, లావణ్య, పరిమళ (నల్లగొండ), జి. కష్ణమ్మ (మహబూబ్‌నగర్), శారద సోని (ఖమ్మం).
Comments
Please login to add a commentAdd a comment