![Telangana Kho Kho Team Wins Silver Medal In National Championship - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/24/Kho-Kho.jpg.webp?itok=JhTK5y1q)
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రాణించింది. సీఐఎస్‌సీఈ నేషనల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోరీ్నలో తెలంగాణ రన్నరప్‌గా నిలిచి రజతాన్ని గెలుచుకుంది. ఆతిథ్య ఉత్తర్‌ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది.
ఘజియాబాద్ వేదికగా పోటీలు జరుగగా... రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) విద్యార్థి జి. కృషితా రెడ్డి టోర్నీ ఆసాంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కృషితా రెడ్డిని అభినందించింది. ఆమె త్వరలో జరుగనున్న ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14 పోటీల్లో పాల్గొనే జట్టులోనూ స్థానం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment