![Telangana victory over Bengal in National Kho-Kho championship - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/10/kho-kho.jpg.webp?itok=OMkuCndS)
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్‌లో శనివారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తెలంగాణ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింటిలో పరాజయం పాలైంది. పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 11–9తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో 4–13తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది.
మహిళల విభాగంలోనూ మహారాష్ట్ర 10–6తో తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. ఇతర మహిళల మ్యాచ్‌ల్లో కర్ణాటక 12–2తో పశ్చిమ బెంగాల్‌పై, పశ్చిమ బెంగాల్ 22–3తో ఢిల్లీపై, కర్ణాటక 19–4తో విదర్భపై, పశ్చిమ బెంగాల్ 4–0తో విదర్భపై, విదర్భ 8–7తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment