ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి | prize money for kho kho players | Sakshi
Sakshi News home page

ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి

Published Sat, Jul 15 2017 10:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి

ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులకు ‘శాట్స్‌’ నగదు బహుమతిని అందజేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన రాష్ట్ర క్రీడాకారులు రంజిత్, నందినిలకు శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌బాబు రూ. 1.25 లక్షల చెక్‌ను అందజేశారు.

 

మొత్తం 8 దేశాలు తలపడిన ఈ టోర్నీలో భారత్‌ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దినకర్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, పీఈటీలు పరమేశ్, సోని పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement