ఇది ఆట కాదు ఖో ఖో! | Nayanthara lead role will be rolled out .. 'Kho Kho' | Sakshi
Sakshi News home page

ఇది ఆట కాదు ఖో ఖో!

Published Tue, Jul 25 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

ఇది ఆట కాదు ఖో ఖో!

ఇది ఆట కాదు ఖో ఖో!

చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘ఖో ఖో’ ఆట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నయనతార లీడ్‌ రోల్‌ చేయనున్న ఓ సినిమాకి ఇదే టైటిల్‌ పెట్టారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా కాదిది. మరి.. ‘ఖో ఖో’ అని టైటిల్‌ ఎందుకు పెట్టినట్లు? అంటే... టైటిల్‌ వెనక అసలు కారణం తెలియడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది. ఎందుకంటే, నయనతారతో ఈ సినిమా తీయనున్న లైకా ప్రొడక్షన్స్‌ ప్రస్తుతానికి పెద్దగా వివరాలేం బయటపెట్టలేదు.

‘డార్క్‌ కామెడీ’ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం పేర్కొన్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో 2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ ‘ఖో ఖో’ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. అఫ్‌కోర్స్‌ ‘2.0’ అంత భారీ బడ్జెట్‌ కాకపోయినా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్‌తో రూపొందే సినిమా అవుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement