పాఠశాల విద్యా ప్రణాళికలో క్రీడలు
► కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు
న్యూఢిల్లీ: దేశ సంప్రదాయ క్రీడలు కబడ్డీ, ఖోఖోలను ఒలింపిక్స్‌లో చేర్చే విధంగా ప్రధాని నరేంద్రమోది కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డీడీ స్పోర్ట్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైన క్రీడలను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రు. క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యంగా క్రీడలు విద్యార్థులను చైతన్యపరుస్తాయని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా చేస్తాయని, న్యాయకత్వలక్షణాలు అలువరుస్తాయని తెలిపారు. క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రావడం మంచి పరిణామమని, ఇవి క్రీడలను ఎంచుకునేలా యువతకు స్పూర్తిని కల్గిస్తాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇక వారణాసీ స్మార్ట్ సిటీ అవుతుందని ప్రజల సహకారంతో మార్పు సాధ్యమన్నారు. వారణాసీ స్మార్ట్ సిటీ అయ్యేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందిని తెలిపారు.