ముగిసిన ఖోఖో క్రీడలు
ముగిసిన ఖోఖో క్రీడలు
Published Thu, Oct 6 2016 10:25 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన సీబీఎస్‌ఈ క్లస్టర్ – 7 ఖో ఖో పోటీలు గురువారం ముగిశాయి. తెలంగాణ, ఏపీ నుంచి 12 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రెసిడెంట్ జగిని భీమయ్య మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపొటములను సమానంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో పాల్గొంటే అన్ని రకాలుగా విజయాలు సాధించవచ్చన్నారు. అనంతరం మెుదటి బహుమతి సాధించిన నల్లగొండ, ద్వితీయ బహుమతి సాధించిన మెదక్, తృతీయ బహుమతి సాధించిన తెనాలి, రంగారెడిడ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి.అమరేందర్‌రావు, కోశాధికారి పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ప్రిన్సిపాల్ పార్థసారధి, అబ్జర్వర్ రాయపురెడ్డిలు పాల్గొన్నారు.
Advertisement