Published
Wed, Sep 21 2016 8:17 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
నల్లగొండ టూటౌన్: క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని ట్రస్మా నాయకులు కొలనుపాక రవికుమార్ అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ గేమ్స్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు చొరవ చూపాలన్నారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్మా నాయకులు వైద్యం వెంకటేశ్వర్లు, ఎన్.ఎల్.నర్సింహారావు, ముక్కాముల రామ్మోహన్, బాలశౌరిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, యాదయ్య, సురేష్, జి.సత్యనారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, యాదగిరిరావు పాల్గొన్నారు.