క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
Published Sun, Sep 4 2016 9:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : క్రీడారంగాన్ని అభివృద్ధికిగాను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా బిల్లును ప్రవేశపెట్టనుందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆదివారం స్థానిక మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో హాకీ క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి ఎస్.అపర్ణకు రూ.2 వేల బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ముఖేష్‌కుమార్ లాంటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడానికి రూ.50 వేలను హాకీ అసోసియేషన్‌కు అందజేస్తున్నట్లు ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికైన హాకీ సంఘాన్ని ఆయన అభినందించారు. త్వరలో నల్లగొండలో హాకీ స్పోర్ట్స్ హాస్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ముఖేష్ కుమార్, అసోసియేట్ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్‌ఖాన్, అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, డీఎస్‌డీఓ మక్బూల్ అహ్మద్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి.కృష్ణమూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్.భిక్షంగౌడ్, కార్యదర్శి నర్సింహారెడ్డి, సలీం, ఓవైసీ ఖాద్రీ, పీఈటీలు బి.శ్రీనివాస్, బి.రవీందర్, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, క్రీడాకారులు ఎండీ.అల్లావుద్దీన్, ఎండీ.దావూద్ అలీ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement