బ్యాంకాక్ : బ్యాంకాక్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత పర్యాటకుడు గాఖ్‌రెజర్ ధీరజ్(42) మృతిచెందాడు. రచ్చత్వేహి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్రూపుల మధ్య ఫైరింగ్ జరగడంతో అక్కడే ఉన్న టూరిస్టులపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఈ కాల్పుల్లో ధీరజ్‌తో పాటూ లావోస్‌కు చెందిన మరో పర్యాటకుడు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులున్నారు.
ఓ మాల్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో పర్యాటకులు భోజనం చేసి బయటకు వచ్చి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. రెండు గ్యాంగ్‌లకు చెందిన సుమారు 20 మంది ఫైరింగ్‌లో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తులు, హాకీ స్టిక్‌లోతోనూ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు రెండు గ్రూపులకు చెందిన సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బ్యాంకాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment