Indian tourist
-
భారత పర్యాటకంలో కొత్త యుగం ఆరంభం: ప్రధాన మోదీ
వారణాసి: అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’కు ఆయన శుక్రవారం వర్చువల్‌గా జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. నమామి గంగా, అర్థ్ గంగా.. ‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’ అని మోదీ అన్నారు. -
ఈయన ప్రపంచానికి ‘పక్కా లోకల్’గా!!
సాక్షి, ఒంగోలు: ‘సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి’ అనే డాక్టర్ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. ‘ఇండియన్ ట్రావెలర్ ఇన్ రష్యా’ అనే పేరుతో రష్యన్ పత్రికలు డాక్టర్ ఆదినారాయణ గురించి వ్యాసాలు రాశాయి. జీవిత విశేషాలు డాక్టర్ ఆదినారాయణ ప్రయాణానుభవాలకి, ఆయన మైండ్ సెట్‌కీ ఒక కలయిక ఉంటుంది. ‘ఎగుడుదిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు’ అంటూ తన జీవిత లక్ష్యాన్ని చాటిచెప్పారాయన. ‘ఎన్ని దేశాలు తిరిగినా, కొత్త ప్రదేశం అంటూ ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం’ అంటారు. విశ్వమానవీయతను చాటే డాక్టర్ ఆదినారాయణ ప్రపంచానికి పక్కా లోకల్‌గా అనిపిస్తాడు. ఆయన స్వయంగా శిల్పి, చిత్రకారుడు. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం, అక్కడి వనరుల్లోనే సర్దుకుపోవడం ఆయన తన ప్రయాణాల్లో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో 30కి పైగా దేశాల్లో ఆయన పాదయాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆయన నడిచినంతమేరా ఆయా ప్రాంతాల భౌగోళిక విశేషాలు, కళ, సంస్కృతి, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, గృహ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపాలు పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు. ‘కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా ఉండలేక, బంధాల్ని తెగ్టొట్టుకుని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను’ అన్న సొంత విచక్షణ కలిగిన డాక్టర్ ఆదినారాయణ కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన మీద ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ.. ‘‘మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తిస్థాయి దేశదిమ్మరిగా మారిపోదాం’ అనేవారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో లోకసంచారిగా ఉండాలని తీర్మానించుకున్నా. ‘ఒరే చిన్న గాలోడా’ అని చిన్నప్పుడు మా అమ్మ పిలిచేది. ఆ పిలుపును సార్థకం చేసుకున్నా’’ అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రయాణాల్లో కొన్ని.. ఆసియా ఖండంలోని నేపాల్(2009), భూటాన్(2010), ఇరాన్(2011), చైనా(2013), ఐరోపాలోని స్వీడన్(2012), నార్వే(2014), ఇటలీ(2014), బ్రిటన్(2015), స్కాట్లాండ్(2015), ఉత్తర అమెరికాలోని మెక్సికో(2014), దక్షిణ అమెరికాలోని బ్రెజిల్(2016), ఆఫ్రికాలోని నైజీరియా(2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా(2015)లో ఆయన చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలను ఆయన రాసిన ‘భూభ్రమణ కాంక్ష’లో పొందుపరిచారు. ఇటీవల రష్యా పత్రికల్లో ఆయన ప్రముఖంగా నిలిచారు. రష్యన్ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్ ‘వెలుగు–విజయం’ పేరుతో రాసిన వ్యాసం సాహిత్య లోకంలో చర్చనీయాంశమైంది. ఏ దేశం వెళితే ఆ దేశ భాష నేర్చుకునే స్కాలర్ జిప్సీ, ఇండియన్ మార్కోపోలోగా పేరు గడించిన డాక్టర్ ఎం.ఆదినారాయణ మన జిల్లా వాసి కావడం విశేషం. ‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ – డాక్టర్ మాచవరపు ఆదినారాయణ -
థాయ్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి రట్చతేవి జిల్లాలోని సెంట్రా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ వద్ద రెండు టీనేజ్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భారత పర్యాటకుడు గాఖ్రేజ్ ధీరజ్ (42), లావోస్ పర్యాటకుడు కెవోంగన్సా (28) ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు భారతీయులు, ఒక లావోస్ పౌరుడితో పాటు మరో ఇద్దరు థాయ్‌లాండ్ పౌరులున్నారు. రాత్రి అక్కడున్న భారతీయ రెస్టారెంట్‌మాల్‌లో పర్యాటకులంతా కలసి భోజనం చేశారు. అనంతరం వారంతా తమ బస్సుకోసం ఎదురు చూస్తూ పార్కింగ్ ప్రదేశంలో నిలబడ్డారు. పార్కింగ్ సమీపంలో ఉన్న స్నూకర్ క్లబ్ దారిలో అకస్మాత్తుగా రెండు టీనేజ్ గ్రూప్‌లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. తొలుత వారి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. నిమిషాల వ్యవధిలోనే అది కాల్పులకు దారి తీసింది. దాదాపు 20 మంది టీనేజర్లు తుపాకులు, కత్తులు, కర్రలు పట్టుకుని క్లబ్ నుంచి వీధిలోకి పరిగెత్తుకొచ్చారని, అందులో ముగ్గురు కాల్పులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం
-
బ్యాంకాక్‌లో కాల్పులు.. భారతీయుడి మృతి
బ్యాంకాక్ : బ్యాంకాక్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత పర్యాటకుడు గాఖ్‌రెజర్ ధీరజ్(42) మృతిచెందాడు. రచ్చత్వేహి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్రూపుల మధ్య ఫైరింగ్ జరగడంతో అక్కడే ఉన్న టూరిస్టులపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఈ కాల్పుల్లో ధీరజ్‌తో పాటూ లావోస్‌కు చెందిన మరో పర్యాటకుడు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులున్నారు. ఓ మాల్లోని ఇండియన్ రెస్టారెంట్లో పర్యాటకులు భోజనం చేసి బయటకు వచ్చి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. రెండు గ్యాంగ్‌లకు చెందిన సుమారు 20 మంది ఫైరింగ్‌లో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తులు, హాకీ స్టిక్లోతోనూ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు రెండు గ్రూపులకు చెందిన సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బ్యాంకాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ కోసం వెళ్ళి...
మసాజ్ కోసం వెళ్లిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 63 ఏళ్ల భారతీయ ప్రబుద్దుడికి న్యూజిలాండ్ కోర్టు గురువారం భారీ జరిమానా విధించింది. నిందితుడు ఇండియాలో ఉన్న సమయంలో ఈ శిక్ష ఖరారైంది. బాధితురాలి తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ప్రారంభంలో న్యూజీలాండ్ సందర్శనకు వెళ్లిన ముంబైకి చెందిన లధానీ అనే వ్యక్తి సెంట్రల్ ఒటాగోలోని ఓ మసాజ్ సెంటర్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేసే యువతిని లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మార్చి 24న జరిగింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు.. కోర్టులో 10,000 డాలర్ల బాండ్ పేమెంట్‌ను సమర్పించాడు. అనారోగ్య కారణాలను పేర్కొని బెయిల్ తీసుకున్న అతడు కోర్టు అనుమతితో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కేసులో తదుపరి విచారణకు హాజరు కాకుండా అనారోగ్యం వంకతో కోర్టుకు మెడికల్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నాడు. దీంతో న్యూజీలాండ్‌లోని క్వీన్స్టౌన్ డిస్ట్రిక్ కోర్టు 2,000 న్యూజీలాండ్ డాలర్ల జరిమానా విధించింది.