మసాజ్ కోసం వెళ్ళి...
మసాజ్ కోసం వెళ్లిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 63 ఏళ్ల భారతీయ ప్రబుద్దుడికి న్యూజిలాండ్ కోర్టు గురువారం భారీ జరిమానా విధించింది. నిందితుడు ఇండియాలో ఉన్న సమయంలో ఈ శిక్ష ఖరారైంది. బాధితురాలి తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ప్రారంభంలో న్యూజీలాండ్ సందర్శనకు వెళ్లిన ముంబైకి చెందిన లధానీ అనే వ్యక్తి సెంట్రల్ ఒటాగోలోని ఓ మసాజ్ సెంటర్కు వెళ్లి అక్కడ మసాజ్ చేసే యువతిని లైంగికంగా వేధించాడు.
ఈ ఘటన మార్చి 24న జరిగింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు.. కోర్టులో 10,000 డాలర్ల బాండ్ పేమెంట్ను సమర్పించాడు. అనారోగ్య కారణాలను పేర్కొని బెయిల్ తీసుకున్న అతడు కోర్టు అనుమతితో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కేసులో తదుపరి విచారణకు హాజరు కాకుండా అనారోగ్యం వంకతో కోర్టుకు మెడికల్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నాడు. దీంతో న్యూజీలాండ్లోని క్వీన్స్టౌన్ డిస్ట్రిక్ కోర్టు 2,000 న్యూజీలాండ్ డాలర్ల జరిమానా విధించింది.