FIH Pro League: India Beats Belgium 5-4 In Shoot Out - Sakshi
Sakshi News home page

FIH Pro League: ‘షూటౌట్‌’లో బెల్జియంపై భారత్‌ విజయం

Jun 12 2022 6:31 AM | Updated on Jun 12 2022 1:09 PM

FIH Pro League: India beats Belgium 5-4 in shoot out  - Sakshi

ఆంట్‌వర్ప్‌: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ బెల్జియం జట్టుతో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ‘షూటౌట్‌’లో 5–4తో గెలిచింది. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్, షంషేర్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్‌... బెల్జియం తరఫున బొకార్డ్, టాన్‌గయ్, సిమోన్, ఆర్థర్‌ సఫలమయ్యారు.

బెల్జియం ప్లేయర్‌ నికోలస్‌ కొట్టిన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ అడ్డుకు న్నాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్‌ 29 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. బెల్జియం మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1–2తో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement