Indian men hockey
-
FIH Pro League: ‘షూటౌట్’లో బెల్జియంపై భారత్ విజయం
ఆంట్వర్ప్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ బెల్జియం జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్... బెల్జియం తరఫున బొకార్డ్, టాన్‌గయ్, సిమోన్, ఆర్థర్ సఫలమయ్యారు. బెల్జియం ప్లేయర్ నికోలస్ కొట్టిన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకు న్నాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్ 29 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. బెల్జియం మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1–2తో ఓడిపోయింది. -
అమిత్ రోహిదాస్కే భారత హాకీ పగ్గాలు
FIH Pro League: జర్మనీ జట్టుతో ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జట్టులో సభ్యుడిగా, వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. స్వదేశంలో అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన నాలుగు ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో అమిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 21 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో ఉంది. చదవండి: IPL 2022: టైటాన్స్ జోరుకు రైజర్స్ బ్రేక్ -
FIH Pro League: ఫ్రాన్స్ చేతిలో భారత్ ఓటమి
FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రోమ్లో శనివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా 2–5 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున జెర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నాలుగో లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడనుంది. సాకేత్ మైనేని జంటకు డబుల్స్ టైటిల్ భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్ లో తొమ్మిదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన బెంగళూరు ఓపెన్ టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట విజేతగా నిలిచింది. హుగో గ్రెనియర్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీతో జరిగిన ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–3, 6–2తో గెలిచింది. కేవలం 45 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సాకేత్ జంట తొమ్మిది ఏస్‌లు సంధించింది. చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్ -
ఓవైపు కోటి నజరానా.. మరోవైపు వెయ్యి రూపాయల ధోతి, షర్టు!
తిరువనంతపురం: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ పరాట్టు రవీంద్రన్ శ్రీజేశ్కు మళయాళీ వ్యాపారవేత్త ఒకరు భారీ నగదు కానుక అందించనున్నారు. గల్ఫ్‌లో నివాసం ఉంటున్న వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వయలిల్ తన తరఫు నుంచి కేరళకు చెందిన శ్రీజేశ్కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. పీఆర్ శ్రీజేశ్కు కేరళ చేనేత శాఖ వెయ్యి రూపాయల విలువ చేసే ధోతి, షర్టు రివార్డుగా ప్రకటించినట్లు మలయాళ వార్తా సంస్థ జన్మభూమి వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఒలింపియన్‌కు ఇంతటి ఘన సన్మానమా.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. శ్రీజేశ్ పట్ల అభిమానాన్ని డబ్బుతో పోల్చి చూడవద్దని హితవు పలుకుతున్నారు. కాగా కేరళకు చెందిన శ్రీజేశ్ భారత పురుషుల హాకీ జట్టులో గోల్ కీపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో గెలుపొంది టీమిండియా 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ -
1980 తర్వాత తొలిసారి; కాంస్య పోరు.. ఫొటోలు వైరల్
Indian Men's Hockey Won Bronze Emotions In Pics: టోక్యో ఒలిపింక్స్‌లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1980 తర్వాత హాకీలో తొలి ఒలింపిక్ పతకం సొంతం కావడంతో భారతీయుల హృదయం సంతోషంతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా కాంస్య పతక పోరులో మన్‌ప్రీత్ సేన జర్మనీపై అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి క్వార్టర్ ముగిసే సరికి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ.. రెండో క్వార్టర్లోనూ 3-1తేడాతో ఆధిపత్యం కనబరిచింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇక రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆ తర్వాత మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో భారత్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. A COMEBACK of the highest order! 🔥🔥🔥#IND scored two back-to-back goals in the second quarter to make it 3-3 vs #GER and then broke through in the third quarter to turn the match in their favour. 👏#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo pic.twitter.com/SW8ZrbGrTp — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 కానీ, చివరి క్వార్టర్లో జర్మనీ గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ భారత డిఫెన్స్ టీం చక్కగా రాణించి విజయాన్ని ఖాయం చేసింది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. గోల్‌కీపర్ శ్రీజేష్ చక్కగా రాణించాడు. An UNFORGETTABLE moment! 🙌😍 The one that #IND has been hungry for over 41 long years. ❤️#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo | #Hockey | #Bronze pic.twitter.com/R530dyTjS1 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాతి గర్వపడేలా చేశారు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తేడాతో భారత్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్, రూపీందర్‌సింగ్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్, సింగ్ మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. India creates history after 41 years! An incredible comeback, after being down by 1-3. #Teamindia displayed strong intent, sealing the match with a 5-4 win at the end. Many congratulations @TheHockeyIndia on winning bronze for India at #Olympics #Tokyo2020 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాయ్స్.. మీరు సాధించేశారు.. ఇక కేకలే!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో గెలుపొందిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకంతో తిరిగి వస్తున్నందుకు భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు ఈ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెల్డన్ బాయ్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరికొత్త చరిత్రకు నాంది: భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైందని కొనియాడారు. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Congratulations to our men's hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ప్రతి భారతీయుడి మనసులో గుర్తుండే జ్ఞాపకం ‘‘చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం’’ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. Historic! A day that will be etched in the memory of every Indian. Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑 — Narendra Modi (@narendramodi) August 5, 2021 ఇక కామ్‌గా ఎలా ఉండగలం ‘‘భారత్‌కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. A BILLION CHEERS for INDIA 🇮🇳! Boys, you’ve done it ! We can’t keep calm !#TeamIndia 🥉! Our Men’s Hockey Team dominated and defined their destiny in the Olympic history books today, yet again ! We are extremely proud of you!#Tokyo2020 pic.twitter.com/n78BqzcnpK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2021 -
టోక్యో ఒలింపిక్స్: కాంస్యం పోరులో దీపక్ పునియా ఓటమి
► టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ దీపక్ పూనియా నిరాశ పరిచాడు. రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో సాన్ మారినోకు చెందిన మైల్స్ నాజెల్ చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో భారత్ తృటిలో మరో పతకం గెలుచుకునే అవకాశం కోల్పోయాడు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు . 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా రవికుమార్ రజతంతో మెరవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం పతకాల సంఖ్య ఐదుకి చేరింది. ► టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక రేసులో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. ఆరంభంలో చైనా అథ్లెట్ వాంగ్‌కు భారత్ అథ్లెట్ సందీప్ కుమార్ గట్టిపోటీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య కేవలం ఒక సెకన్ మాత్రమే ఉండడంతో హోరాహోరీగా కొనసాగింది. అయితే అదే టెంపోనూ సందీప్ చివరివరకు నిలబెట్టలేకపోయాడు. గంట 25 నిమిషాలు 7 సెకన్లలో రేసును ముగించిన సందీప్ ఓవరాల్‌గా 32వ స్థానంలో నిలవగా.. మరో భారత అథ్లెట్ రాహుల్ గంట 32 నిమిషాల 6 సెకన్లలో రేసు ముగించి 47వ స్థానంలో నిలిచాడు. ఇక ఇటలీకి చెందిన స్టానో మాసిమో గంట 21 నిమిషాల 05 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం గెలవగా.. జపాన్‌కు చెందిన ఇకిడా కోకి గంట 21 నిమిషాల 14 సెకన్లతో రజతం.. జపాన్‌కే చెందిన మరో అథ్లెట్ యమాన్షి తోషికాజు గంట 21 నిమిషాల 28 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నాడు. Tokyo Olympics Day 14 Updates: టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక పోటీ హోరాహోరీగా సాగుతోంది. మొదటి స్థానంలో చైనా అథ్లెట్ వాంగ్ కొనసాగుతుండగా.. భారత్‌కు చెందిన సందీప్ కుమార్(హర్యానా) రెండో స్థానంలో ఉన్నాడు. వాంగ్‌కు, సందీప్‌కు మధ్య తేడా కేవలం ఒక సెకన్ మాత్రమే తేడా ఉండటం విశేషం. కాగా ఈ పోటీలో ముందున్న కాలు మడత పడకుండా నడవాలన్న నిబంధన ఉంటుంది. అదే విధంగా... ఏదో ఒక కాలు కచ్చితంగా నేల మీదుండాలన్నది రెండో నిబంధన. సుమారు ఒక గంట 20 నిమిషాల పాటు ఈ రేసు సాగనుంది. ఇక 20కి.మీ. నడక రేసులో ఇప్పటివరకున్న ప్రపంచ రికార్డు 1గంట 16నిమిషాలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ అద్భుతం చేసింది. కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించి పతకంతో పాటు కోట్లాది మంది భారతీయుల మనసును గెలుచుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. తద్వారా సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత పురుషుల హాకీ జట్టు ఖాతాలో ఒలింపిక్స్ పతకం చేరింది. ఇక తాజాగా మన్‌ప్రీత్ సేన విజయంతో.. ఇప్పటి వరకు తాజా ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య మొత్తంగా ఐదుకు చేరింది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్, రూపీందర్‌సింగ్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్, సింగ్ మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. నిరాశ పరిచిన వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బెలారస్‌కు చెందిన వనేసా చేతిలో 3-9 తేడాతో ఓటమి పాలైంది. అయితే, రెజిచేజ్ రూపంలో వినేశ్ కాంస్య పతకం గెలిచే ఆశలు సజీవంగానే ఉన్నాయి. భారత్- జర్మనీ హోరాహోరీ: ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం భారత్- జర్మనీ పురుషుల హాకీ జట్టు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. చివరిదైన నాలుగో క్వార్టర్ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్ వరకు భారత్ 5-3తో ఆధిక్యంలో కొనసాగగా.. ఆఖరి క్వార్టర్లో జర్మనీ తొలి గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించింది. మరోసారి జర్మనీకి గోల్ చేసే అవకాశం వచ్చినా భారత డిఫెన్స్ టీం చక్కగా అడ్డుకుంది. ప్రస్తుతం స్కోరు 5-3గా ఉంది. ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో భారత పురుషుల హాకీ జట్టు అదరగొడుతోంది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే రెండు గోల్స్ చేసి సత్తా చాటింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ క్వార్టర్లో భారత్‌కు పాయింట్ అందించగా.. సిమ్రన్‌జీత్ రెండో గోల్ సాధించాడు. తద్వారా మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకో 15 నిమిషాల ఆట మిగిలి ఉంది. వహ్వా వినేశ్ రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగంలో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది. సోఫియా మగ్డలెనాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? నిరాశపరిచిన అన్షుమాలిక్ రెజ్లింగ్ మహిళల 57 కిలోల రెపిచేజ్‌లో భారత మహిళా రెజ్లర్ అన్షుమాలిక్ నిరాశ పరిచింది. 1-5తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. అదరగొడుతున్న భారత్... 5-3తో ఆధిక్యంలో ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 5-3 తేడాతో ఆధిక్యంలో ఉంది. ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం భారత్- జర్మనీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ నాలుగో గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్‌కు పాయింట్ అందించాడు. ►రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ తరఫున సిమ్రన్‌జీత్, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ ఒక్కో గోల్ చేశారు. చివరి రెండు గోల్స్ పెనాల్టీ కార్నర్ ద్వారా లభించాయి. ఇక జర్మనీకి తైమూర్ ఓరుజ్, నిక్లాస్ వెలెన్, బెనెడిక్ట్ మూడు పాయింట్లు అందించారు. ►కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో పోరాడుతోంది. రెండో క్వార్టర్లో జర్మనీ వరుసగా రెండు గోల్స్ కొట్టి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి జర్మనీ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఈసారి హార్దిక్ సింగ్ భారత్‌కు పాయింట్ అందించాడు. ఇక అంతకుముందు సిమ్రన్‌జీత్ గోల్‌తో భారత్‌కు ఒక పాయింట్ దక్కింది. ►రెండో క్వార్టర్లో సిమ్రన్‌జీత్ గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. తాజా ఒలింపిక్స్‌లో అతడికిది రెండో గోల్. ప్రస్తుతం స్కోరు 1-1 సమంగా ఉంది. ►గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ తొలి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో ఉంది. జర్మనీ ప్లేయర్ తైమూర్ ఓరుజ్ ఈ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు చేశాడు. మరోవైపు... జర్మనీకి చివరి నిమిషంలో పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా భారత డిఫెన్స్ చక్కగా అడ్డుకుని మరో గోల్ కొట్టకుండా అడ్డుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉదయం 7 గంటలకు హాకీ పురుషుల కాంస్య పతక పోరు ►ఉ.7:30 నుంచి రెజ్లింగ్ మహిళల 57 కిలోల రెపిచేజ్ (అన్షుమాలిక్) ►ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగం (వినేశ్ ఫొగాట్) ►మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అథ్లెటిక్స్ పురుషుల 20 కి.మీ నడక ఫైనల్ ►మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్ మహిళల 57 కిలోల కాంస్య పతక పోరు ►మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగం సెమీస్ ►మ.2:45 నుంచి పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్ (రవికుమార్ దహియా) ►మ.2:45 నుంచి పురుషుల 86 కిలోల కాంస్య పతక పోరు (దీపక్ పునియా) -
‘ఒక్క రోజు.. ఒక్క మ్యాచ్ మాత్రమే.. గెలిచి తీరుతాం’
టోక్యో: ‘‘ఇది నిజంగా బాధాకరమైన రోజు. అతిముఖ్యమైన మ్యాచ్‌లో ఓడిపోయాం. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్ల విషయంలో పెద్ద తప్పులు చేశాం. అయితే, ఇప్పటికీ కాంస్యం గెలిచే అవకాశం ఉంది కదా. కాబట్టి పతకం గెలిచేందుకు మేం పూర్తిగా కృషి చేస్తాం. అన్ని విధాలా సన్నద్ధమవుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. మాకు ఇంకొక్క రోజు.. ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి తప్పకుండా పోరాడతాం. ఒకరికొకరం పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ మమ్మల్ని మేం సన్నద్ధం చేసుకుంటాం’’ అని భారత పురుషుల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ మన్దీప్ సింగ్ పేర్కొన్నాడు. సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతక పోరులో తప్పక గెలిచితీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా... స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చాంపియన్‌తో మ్యాచ్ అంత సులభమేమీకాదు. కొన్ని తప్పిదాలు జరిగాయి. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. కాగా మంగళవారం నాటి టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దేశమంతా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ మ్యాచ్‌లో పరాజయం ఎదురుకావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన కనబరిచారని, తదుపరి మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడాలని ఆకాంక్షించారు. కాగా సెమీస్-2లో ఓడిన జట్టుతో భారత్ కాంస్య కోసం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. -
Tokyo Olympics: 41 ఏళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో..
టోక్యో: 41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్... నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న బెల్జియం ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ కూడా కావడం విశేషం. గత కొన్నేళ్లలో ఎంతో మెరుగుపడిన బెల్జియం జట్టును ఓడించాలంటే మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా ఆద్యంతం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా అప్రమత్తంగా ఆడితే భారత్‌కు విజయం దక్కడం ఖాయం. 2019లో యూరోప్ పర్యటనలో బెల్జియం జట్టుతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. బెల్జియంపై నెగ్గి ఫైనల్ చేరుకుంటే భారత్‌కు స్వర్ణం లేదా రజతం ఖరారవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
మనసు మార్చుకున్న టెర్రీ వాల్ష్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కోచ్ గా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆయనతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, కోచ్ గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) డీజీ జీజీ థామ్సన్ తెలిపారు. ఇదే విషయాన్ని టెర్రీ వాల్ష్ కూడా సూచనప్రాయంగా వెల్లడించారు. సాయ్ తో నెలకొన్న చెల్లింపుల వివాదం కారణంగా టెర్రీ వాల్ష్ మంగళవారం కోచ్ పదవికి రాజీనామా చేశారు. దేశ క్రీడలకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల నిర్ణయాధికార శైలి తనకు ఇబ్బందిగా ఉందని రాజీనామా సందర్భంగా 60 ఏళ్ల వాల్ష్ వెల్లడించారు.