సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తేడాతో భారత్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా గురువారం నాటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
భారత పురుషుల హాకీ జట్టు:
మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్, రూపీందర్‌సింగ్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్, సింగ్ మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్.
India creates history after 41 years!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021
An incredible comeback, after being down by 1-3. #Teamindia displayed strong intent, sealing the match with a 5-4 win at the end. Many congratulations @TheHockeyIndia on winning bronze for India at #Olympics #Tokyo2020
Comments
Please login to add a commentAdd a comment