Indian Men's Hockey Won Bronze Emotions In Pics: టోక్యో ఒలిపింక్స్‌లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1980 తర్వాత హాకీలో తొలి ఒలింపిక్ పతకం సొంతం కావడంతో భారతీయుల హృదయం సంతోషంతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా కాంస్య పతక పోరులో మన్‌ప్రీత్ సేన జర్మనీపై అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తొలి క్వార్టర్ ముగిసే సరికి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ.. రెండో క్వార్టర్‌లోనూ 3-1తేడాతో ఆధిపత్యం కనబరిచింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించడంతో పోరు రసవత్తరంగా మారింది.
ఇక రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
ఆ తర్వాత మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో భారత్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది.
A COMEBACK of the highest order! 🔥🔥🔥#IND scored two back-to-back goals in the second quarter to make it 3-3 vs #GER and then broke through in the third quarter to turn the match in their favour. 👏#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo pic.twitter.com/SW8ZrbGrTp
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021
కానీ, చివరి క్వార్టర్‌లో జర్మనీ గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ భారత డిఫెన్స్ టీం చక్కగా రాణించి విజయాన్ని ఖాయం చేసింది.
భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు.
గోల్‌కీపర్ శ్రీజేష్ చక్కగా రాణించాడు.
An UNFORGETTABLE moment! 🙌😍
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021
The one that #IND has been hungry for over 41 long years. ❤️#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo | #Hockey | #Bronze pic.twitter.com/R530dyTjS1
Comments
Please login to add a commentAdd a comment