తిరువనంతపురం: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ పరాట్టు రవీంద్రన్ శ్రీజేశ్‌కు మళయాళీ వ్యాపారవేత్త ఒకరు భారీ నగదు కానుక అందించనున్నారు. గల్ఫ్‌లో నివాసం ఉంటున్న వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వయలిల్ తన తరఫు నుంచి కేరళకు చెందిన శ్రీజేశ్‌కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. పీఆర్ శ్రీజేశ్‌కు కేరళ చేనేత శాఖ వెయ్యి రూపాయల విలువ చేసే ధోతి, షర్టు రివార్డుగా ప్రకటించినట్లు మలయాళ వార్తా సంస్థ జన్మభూమి వెల్లడించింది.
ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఒలింపియన్‌కు ఇంతటి ఘన సన్మానమా.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. శ్రీజేశ్ పట్ల అభిమానాన్ని డబ్బుతో పోల్చి చూడవద్దని హితవు పలుకుతున్నారు. కాగా కేరళకు చెందిన శ్రీజేశ్ భారత పురుషుల హాకీ జట్టులో గోల్ కీపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో గెలుపొంది టీమిండియా 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ
Comments
Please login to add a commentAdd a comment