భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కోచ్ గా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆయనతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, కోచ్ గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) డీజీ జీజీ థామ్సన్ తెలిపారు. ఇదే విషయాన్ని టెర్రీ వాల్ష్ కూడా సూచనప్రాయంగా వెల్లడించారు.
సాయ్ తో నెలకొన్న చెల్లింపుల వివాదం కారణంగా టెర్రీ వాల్ష్ మంగళవారం కోచ్ పదవికి రాజీనామా చేశారు. దేశ క్రీడలకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల నిర్ణయాధికార శైలి తనకు ఇబ్బందిగా ఉందని రాజీనామా సందర్భంగా 60 ఏళ్ల వాల్ష్ వెల్లడించారు.