ఒలింపియాడ్ స్ఫూర్తితో రాణిస్తా: గుకేశ్
భారత్ చేరిన చెస్ విజేతలకు బ్రహ్మరథం
చెన్నై: చెస్ ఒలింపియాడ్ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. నవంబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనీస్ గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్‌గుకేశ్ ప్ టైటిల్ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్‌ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్‌లో గుకేశ్, లిరెన్‌ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ హంగేరిలో ముగిసిన చెస్ ఒలింపియాడ్‌లో కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా పురుషుల టీమ్ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్‌పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్‌గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్‌లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు.
ఒలింపియాడ్‌లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు.
ఘనస్వాగతం
అంతకుముందు బుడాపెస్ట్ నుంచి చెస్ ఒలింపియాడ్ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్‌లకు చెన్నైలో చెస్ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.
పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్‌మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్ ఒలింపియాడ్‌లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు.
అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లకు ఢిల్లీ చెస్ సంఘం అధికారులు, హైదరాబాద్‌లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment