లక్నోలో ఉగ్రవాది కాల్పులు! | Shootout In Lucknow Between Cops And Alleged Terrorist | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: లక్నోలో ఉగ్రవాది కాల్పులు!

Published Tue, Mar 7 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

లక్నోలో ఉగ్రవాది కాల్పులు!

లక్నోలో ఉగ్రవాది కాల్పులు!

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉగ్రవాదికి, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉగ్రవాదికి, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. నగర శివారల్లోని ఠాకూర్‌గంజ్‌ ప్రాంతంలో ఓ అనుమానిత ఉగ్రవాది నక్కినట్టు సమాచారం అందడంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) రంగంలోకి దిగింది. దీంతో ఏటీఎస్‌ పోలీసులు, ఉగ్రవాదికి మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఏటీఎస్‌ దళాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్‌ కొనసాగుతున్నదని యూపీ పోలీసు చీఫ్‌ జవీద్‌ అహ్మద్‌ విలేకరులకు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం రేపటితో ముగియనుంది. చివరి ఏడో దఫా పోలింగ్‌ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నోలో కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. నక్కిన ఉగ్రవాది గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement