కేసు వాపస్ తీసుకోని యువతిపై గ్యాంగ్ రేపిస్టుల కాల్పులు
కేసు వాపస్ తీసుకోని యువతిపై గ్యాంగ్ రేపిస్టుల కాల్పులు
Published Tue, Apr 29 2014 3:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
ఎంతో కొండ డబ్బు పుచ్చుకుని కేసు ఉపసంహరించుకునేందుకు ఒప్పుకోని గ్యాంగ్ రేప్ బాధితురాలిని దుండగులు కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో బాధితురాలు తృటిలో తప్పించుకుంది. ఒక బుల్లెట్ ఆమె భుజానికి రాసుకుంటూ వెళ్లింది.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో ఒక మహిళ గత జనవరి 21 న సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి కొంత మంది దుండగులు ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమె వీరిపై ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ దుండగులు ఆమెతో కేసు ఉపసంహరించుకునేందుకు బేరసారాలు జరుపుతున్నారు. యువతి ససేమిరా అనడంతో సోమవారం రాత్రి ఆమె రిక్షాలో వెళ్తూండగా ఆమెపై కాల్పులు జరిపారు.
కాల్పులు జరిపిన వారిని వసీమ్, రషీద్ లు గా గుర్తించారు. ఈ సంఘటనలో మరో వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు. వసీమ్, రషీద్ లు కేసు ఉపసంహరించుకోవలసిందిగా ఆమెను బలవంత పెడుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం క్షేమంగానే ఉంది.
Advertisement