సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’ . శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం..డిసెంబర్ 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి రోనక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు భయపడ్డాను. కొన్ని సార్లు దర్శకుడితో గొడపవడ్డాను. మొత్తం ఎడిటింగ్ లో చూశాక దర్శకుడి విజన్ అర్థమైంది. ఆయన చూపించిన సీన్స్ ఏవీ ఇబ్బంది పెట్టేలా ఉండవు.
నాకు డాన్స్, ఫైట్స్ బాగా వచ్చు. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ కు డాన్సు నేర్పంచాను. ఆ స్కిల్ చూపించే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పదివేల కోట్ల రూపాయల డైమండ్స్ పాయింట్ చుట్టూ కథ సాగుతుంది. ఈవీవీ గారి స్టైల్ సినిమాల్లో ఉన్నట్లు ఒక ఛేజింగ్ తో సినిమా సాగుతుంది. ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది’ అన్నారు.
Sai Ronak: రొమాంటిక్ సీన్స్‌లో చాలా భయపడ్డా.. డైరెక్టర్‌తో గొడవపడ్డాను
Published Wed, Dec 28 2022 2:22 PM | Last Updated on Wed, Dec 28 2022 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment