rajayogam
-
ఓటీటీలో రాజయోగం.. అప్పటినుంచే స్ట్రీమింగ్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రాజయోగం. ఈ చిత్రంతో రామ్ గణపతి దర్శకుడిగా పరిచయమయ్యాడు. డిసెంబర్ 30న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ఈ సినిమాను శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణిలక్ష్మణ్ రావు నిర్మించారు. కథ విషయానికి వస్తే.. మధ్య తరగతి కుర్రాడు రిషి(సాయి రోనక్) మెకానిక్‌గా పని చేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఓసారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కు ఇచ్చేందుకు స్టార్ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)తో లవ్‌లో పడతాడు. ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే డేనియల్ దగ్గరున్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్) గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? అసలు రిషి, శ్రీ కలుసుకున్నారా? లేదా? అనేదే కథ. Brace yourselves for an ultimate cocktail of love, lust, fun, and action 🍹❤️🔥#Raajahyogam premieres Feb 9 only on #DisneyplusHotstar #RaajahyogamOnHotstar#SaiRonak #AnkitaSaha #Bismi#RamGanapathi #ManiLakshman #Shyam #Nandakishore #VaishnaviNatrajProduction pic.twitter.com/LN3wdvvIRG — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 2, 2023 చదవండి: మేకప్ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం -
'ఆ సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ'
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రానికే అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తాం.' అని ప్రకటించారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపిస్తోంది. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. రాజయోగం చిత్రాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా.' అని అన్నారు. హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ..'రాజయోగం థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కాబట్టి ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడకండి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మీకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది.' అని చెప్పుకొచ్చింది. తాగుబోతు రమేష్ మాట్లాడుతూ..'దర్శకుడు రామ్ గణపతి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలతో సినిమాను రూపొందించారు. ఆయనకు సినిమా అంటే ఫ్యాషన్. అందుకే విదేశాల్లో పనిచేసే కెరీర్ వదులుకుని వచ్చారు.' అని అన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ..'రాజయోగం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఇటీవల కొందరు గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారన్నాడు. కానీ.. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి.' అని అన్నారు. -
‘రాజయోగం’ మూవీ రివ్యూ
టైటిల్: రాజయోగం నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ దర్శకత్వం: రామ్ గణపతి సంగీతం: అరుణ్ మురళీధరన్ డైలాగ్స్: చింతపల్లి రమణ సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. రిషి(సాయి రోనక్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని కలలు కంటాడు. దాని కోసం సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ సారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కి ఇచ్చేందుకై స్టార్ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే.. డేనియల్ (సిజ్జు) వద్ద ఉన్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్)గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. దీంతో రిషి.. ఎలాగైన శ్రీ అసలు రంగును బయటపెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి ఎదురైన సవాళ్లు ఏంటి? రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను కొట్టేశాడా? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? రిషి, శ్రీల మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్) ఎవరు? వజ్రాల గొడవకు, ఐశ్యర్యకు ఎలాంటి సంబంధం ఉంది? తదితర విషయాలు తెలియాలంటే ‘రాజయోగం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ కామెడీ చిత్రాలను టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అందుకే జోనర్లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. రాజయోగం కూడా క్రైమ్ కామెడీ సినిమానే. యూత్‌ని ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సన్నివేశాలు యాడ్ చేశారు. వజ్రం కోసం జరిగే వేటలో ఇద్దరు ప్రేమికులు ఎలా ఇరుక్కున్నారు? ఆ వజ్రం ఎవరికి దొరికింది? చివరకు రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ. యూత్‌ని టార్గెట్‌గా పెట్టుకొని దర్శకుడు రామ్ గణపతి ఈ కథను అల్లుకున్నాడు. అడల్ట్ కామెడీ, మితిమీరిన శృంగారం.. యువతను ఆకట్టుకున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. ఫస్టాఫ్‌లో ఈతరం యువతి, యువకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. అజయ్ ఘోష్, చిత్రం శ్రీనుల కామెడీతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం ఫస్టాఫ్‌లో ఉన్నంత జోష్ ఉండదు. సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. హోటల్ సీన్‌తో పాటు ఒకటి రెండు సన్నివేశాలు నవ్వించినప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ..అన్ని రకాల ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ముఖ్యంగా హీరోయిన్ అంకితతో కలిసి పండించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. అంకిత కూడా ఓ మంచి వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. శ్రీ పాత్రలో ఆమె చేసిన రొమాన్స్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. కేవలం అందాల ఆరబోతకే కాకుండా.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది. విలన్ పాత్రలో డేనియల్ గా సిజ్జు బాగా నటించారు. అలాగే మరో విలన్ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా తన స్టైల్ లో బాగా నటించారు. అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. అరుణ్ మురళీధరన్ నేపథ్య సంగీతం బాగుంది. సిధ్ శ్రీరామ్ ఆలపించిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. -
రొమాంటిక్ సీన్స్‌లో చాలా భయపడ్డా.. డైరెక్టర్‌తో గొడవపడ్డాను: హీరో
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’ . శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం..డిసెంబర్ 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి రోనక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు భయపడ్డాను. కొన్ని సార్లు దర్శకుడితో గొడపవడ్డాను. మొత్తం ఎడిటింగ్ లో చూశాక దర్శకుడి విజన్ అర్థమైంది. ఆయన చూపించిన సీన్స్ ఏవీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. నాకు డాన్స్, ఫైట్స్ బాగా వచ్చు. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ కు డాన్సు నేర్పంచాను. ఆ స్కిల్ చూపించే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పదివేల కోట్ల రూపాయల డైమండ్స్ పాయింట్ చుట్టూ కథ సాగుతుంది. ఈవీవీ గారి స్టైల్ సినిమాల్లో ఉన్నట్లు ఒక ఛేజింగ్ తో సినిమా సాగుతుంది. ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది’ అన్నారు. -
ఆ సినిమాతో సంపాదించిందంతా పోగొట్టుకున్నాను: డైరెక్టర్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజయోగం”. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలవుతున్న సందర్బంగా దర్శకుడు రామ్ గణపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమా తీయాలనే తపన నాలో ఉండేది. నా చదువైపోయాక ఎక్కువగా యానిమేషన్ ఫీల్డ్‌లో చాలా సంవత్సరాలు వర్క్ చేశాను. ఈ క్రమంలో ప్యారిస్‌లో 9 సంవత్సరాలున్నాను. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియాకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అన్ని ఎమోషన్స్ ఉండేటువంటి ఒక మంచి సినిమా తియ్యాలని "ఇఈ" (ఇతడు ఈమె ) సినిమా తీశాను. అప్పుడు పెద్ద సినిమాల మధ్య ఆ సినిమా రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో నేను 20 సంవత్సరాల నుంచి సంపాదించుకుందంతా పొగొట్టుకున్నాను. కానీ నాకు సినిమా మీద ప్యాషన్ ఉండడంతో నేనేం బాధ పడలేదు. పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమాలో నటించే స్టార్స్ కొరకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అదే చిన్న సినిమా తీస్తే దాన్ని ఓటీటీలో చూడడానికి అలవాటు పడ్డారు. అయితే ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడడానికి థియేటర్స్‌కు రావాలంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉండాలి. అందుకే ఈసారి యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసేటటువంటి కమర్షియల్ సినిమా తీయాలని ఫ్రెండ్స్‌తో కలసి మంచి రొమాంటిక్ యూత్ ఫుల్ సబ్జెక్ట్ తీశాం. ఇందులో డ్రైవర్‌గా పని చేసే హీరో ఓక స్టార్ హోటల్లో నాలుగు రోజులు ఉండే పరిస్థితి వస్తుంది. అక్కడే తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే "రాజయోగం" అంటే ఒక వజ్రం కోసం జరిగే వేట. ఆ వజ్రం ఎవరికీ దొరికింది? ఆ రాజయోగం ఎవరికీ వరించింది? అనేదే కథ. ఇందులో హీరో సాయి రోనక్ చాలా బాగా నటించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ కేరళలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. హీరోయిన్గా చాలా మందిని అనుకున్నాము. అయితే ఎవరికి కథ చెప్పినా ఎక్కువ ముద్దు సీన్స్ ఉన్నాయని చేయడానికి ముందుకు రాలేదు. చివరకు అంకిత సాహా, బిస్మి నాస్‌లు ఈ సినిమా ఒప్పుకుని చాలా చక్కగా నటించారు. ఇందులో రొమాన్స్, ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నా కూడా అశ్లీలంగా ఉండదు' అని ముగించారు. చదవండి: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. ఒంటిపై గాయాలు: పోస్ట్‌మార్టమ్ సిబ్బంది తప్పతాగిన స్టార్ హీరో కూతురు, నెట్టింట ట్రోలింగ్ -
రొమాంటిక్ కామెడీ కథగా 'రాజయోగం'.. టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రోనక్ ఇచ్చిన మాట ప్రకారమే ఇక్కడికి వచ్చా. సాయి రోనక్ నాలాగే పక్కా హైదరాబాద్ కుర్రాడు. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా.' అని అన్నారు. నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. 'మా చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో విశ్వక్ సేన్‌కు కృతజ్ఞతలు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. మా టీమ్ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది.' అని అన్నారు. దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో రోనక్ పర్మార్మెన్స్ సూపర్. ఇద్దరు హీరోయిన్స్ బాగా నటించారు. అంకిత క్యారెక్టర్ కొద్దిగా గ్రే షేడ్‌లో ఉంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో పడిందే అని సాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. మూవీని ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 9న థియేటర్‌కు రండి.' అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'మా కార్యక్రమానికి వచ్చిన విశ్వక్ అన్నకు థాంక్స్. మా సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. నాకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం లక్కీ. నాకు ఫైట్స్, డాన్స్ చేయడం ఇష్టం. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు.' అని అన్నారు. -
కేసీఆర్‌కు రాజయోగమే
సాక్షి, హైదరాబాద్: ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి తెలిపారు. ‘రాహులో రవి అంతర్దశ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనుకూలం కాని సమయం ముగిసిపోయింది. ఇక గుహ నుంచి బయటకు వచ్చుడే తర్వాయి అన్నట్టుగా ఉంటుంది. జాతక బలం గతేడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంది. శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమాత్రం సందివ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారు. దేశం మొత్తం కూడా దృష్టి సారించదగ్గ సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారు. విశ్వరూపమే చూపిస్తారు..’అని చెప్పారు. ఈ ఏడాది కరోనా భయం ఉండదని, శుభకృత్ నామ సంవత్సరంలో మానవాళి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. శుభకృత్ నామ ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్లో ప్రభుత్వపరంగా నిర్వహించిన వేడుకల్లో బాచంపల్లి పంచాంగాన్ని పఠించి వివరించారు. అద్భుత పాలన చూస్తాం ‘తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా. జాతక రీత్యా పంటలతో పాటు తెలంగాణలో అద్భుత పాలనను మనం ఈ సంవత్సరం చూస్తాం. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది. చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజింపజేస్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటారు. పార్టీలు మారే వారికి గడ్డుకాలం..’అని చెప్పారు. మంచి వానలు, పంటలతో రైతు రాజ్యం ‘మంచి వానలు, మంచి పంటలతో రైతు రాజ్యం వెల్లివిరుస్తుంది. కర్షక ప్రజాస్వామ్యం కోరుకుంటున్నందున, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణలో రైతులే రాజులు కానున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు వానలకు ఇబ్బంది లేనట్టే ఈ యేడు కూడా మంచి వానలు కురుస్తాయి. వరి, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, జొన్న, రబీ పంటలు అద్భుతంగా పండుతాయి. మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, ఇతర పప్పు ధాన్యాలు లాంటి పంటలకు కొంత ఇబ్బంది తప్పదు. శ్రావణ, భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..’అని బాచంపల్లి తెలిపారు. మహిళకు దేశంలో అత్యున్నత పదవి ‘విద్యారంగంలో సంస్కరణలు, కొత్త విధివిధానాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయి. దీన్ని ఉద్యోగనామ సంవత్సరంగా భావించొచ్చు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోనుంది. ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే ఉత్సవాలతో సంవత్సరం గడుస్తుంది. ఆన్లైన్ క్లాసులుండవు, బడి గంటలే వినిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, మాస్కుల అవసరం ఉండదు. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు..’అని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్, మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుండగా, మిగతా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండదు. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ మీదే ఉంటుంది..’అని వివరించారు. -
రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం
రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం 8 నాలుగింతలు పెరగనున్న విస్తీర్ణం 8 రేపు పాలకమండలి ముందుకు మాస్టర్ ప్లాన్ 8 ఆమోదం లాంఛనప్రాయమే 8 13 పంచాయతీల విలీనంతో మారనున్న నగర రూపురేఖలు సాక్షి, రాజమహేంద్రవరం : పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్న రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం పట్టనుంది. నాలుగు దశాబ్దాల తర్వాత నగరపాలక సంస్థలో నూతన మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. 1975లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం అమలులో ఉంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజమహేం ద్రవరం నగర జనాభాకు అనుగుణంగా నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ ముసాయిదాను రూపొందించింది. దీనిపై నగర ప్రజల అభిప్రాయాలు సేకరించి, సవరించిన ప్రణాళికను ప్రభుత్వానికి పంపింది. అప్పటి నుంచి నూతన ప్రణాళికకు ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ శుక్రవారం జరిగే నగరపాలక మండలి సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం లాంఛనమే కావడంతో మాస్టర్ ప్లాన్ అమలులోకి రానుంది. 2031 నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారనున్నాయి. నాలుగు రెట్లు పెరగనున్న విస్తీర్ణం నూతన మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే నగర పరిధి 162.83 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 1975 మాస్టర్ ప్లాన్ ప్రకారం నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. దీని ప్రకారం 111.33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రూరల్ నియోజకవర్గంలో ఉన్న 13 పంచాయతీలు నగరంలో విలీనం కానున్నాయి. కాతేరు, తొర్రేడు, కోలమూరు–కొంతమూరు, గాడాల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్ చెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ–మోరంపూడి, బొమ్మూరు, ధవళేశ్వరం, మధురపూడి పంచాయతీలు నగరంలో కలవనున్నాయి. ఈ ప్రాంతాలు కలుస్తుండడంతో రాజమహేంద్రవరం నగర విస్తీర్ణం 44.5 చ.కి.మీటర్ల నుంచి 162.83 చ.కి.మీటర్ల మేర నాలుగు రెట్లు పెరగనుంది. జనాభా దాదాపు రెట్టింపు కానుంది. ప్రస్తుతం 3.41 లక్షలుగా ఉన్న జనాభా 13 పంచాయతీలు కలుస్తుండడంతో 5.92 లక్షలకు పెరగనుంది. తీరనున్న సమస్యలు పురాతన రాజమహేంద్రవరం నగరంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ ఆధారం. వ్యాపార, విద్య, ఉపాధి అవకాశాలు పెరగడంతో నగర జనాభా గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2011 లెక్కల ప్రకారం నగరంలో జనాభా 3.41 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి అనుగుణంగా డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు పొంగి రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇరుకు రోడ్లతో మెయిన్‌బజారు, తాడితోట, శ్యామలా సెంటర్, దేవీచౌక్ తదితర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. గోదావరి చెంత ఉన్నా తాగునీటికి తిప్పలు తప్పడంలేదు. ఆవ చానల్, నల్లా చానల్ ద్వారా గోదావరిలోకి మురుగునీరు కలుస్తుండడంతో నది కలుషితమవుతోంది. మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే ఈ సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది.