'ఆ సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ' | Rajayogam Success Meet Celebrations In Hyderabad | Sakshi
Sakshi News home page

Rajayogam Movie:  'సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ చిన్న కండీషన్''

Published Sun, Jan 1 2023 9:04 PM | Last Updated on Sun, Jan 1 2023 9:05 PM

Rajayogam Success Meet Celebrations In Hyderabad - Sakshi

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది

దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రానికే అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే  లక్ష రూపాయల బహుమతి ఇస్తాం.' అని ప్రకటించారు. 

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే  కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపిస్తోంది. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. రాజయోగం చిత్రాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా.' అని అన్నారు. హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ..'రాజయోగం థియేటర్‌లోనే చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కాబట్టి ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడకండి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మీకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది.' అని చెప్పుకొచ్చింది.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ..'దర్శకుడు రామ్ గణపతి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలతో సినిమాను రూపొందించారు. ఆయనకు సినిమా అంటే ఫ్యాషన్. అందుకే విదేశాల్లో పనిచేసే కెరీర్ వదులుకుని వచ్చారు.' అని అన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ..'రాజయోగం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఇటీవల కొందరు గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారన్నాడు. కానీ.. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి.' అని అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement