ఆ సినిమాతో సంపాదించిందంతా పోగొట్టుకున్నాను: డైరెక్టర్‌ | Raaja Yogam Director Ram Ganapathi about His Personal Experience | Sakshi
Sakshi News home page

Ram Ganapathi: ఆ సినిమావల్ల ఉన్నదంతా పోయింది.. ఈ మూవీకి హీరోయిన్స్‌ ముందుకు రాలేదు

Published Mon, Dec 26 2022 5:55 PM | Last Updated on Tue, Dec 27 2022 8:43 AM

Raaja Yogam Director Ram Ganapathi about His Personal Experience - Sakshi

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజయోగం”. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలవుతున్న సందర్బంగా దర్శకుడు రామ్ గణపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమా తీయాలనే తపన నాలో ఉండేది. నా చదువైపోయాక ఎక్కువగా యానిమేషన్ ఫీల్డ్‌లో చాలా సంవత్సరాలు వర్క్ చేశాను. ఈ క్రమంలో ప్యారిస్‌లో 9 సంవత్సరాలున్నాను. అక్కడ  సంపాదించిన డబ్బుతో ఇండియాకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అన్ని ఎమోషన్స్ ఉండేటువంటి ఒక మంచి  సినిమా తియ్యాలని "ఇఈ" (ఇతడు ఈమె ) సినిమా తీశాను. అప్పుడు పెద్ద సినిమాల మధ్య ఆ సినిమా రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో నేను 20 సంవత్సరాల నుంచి సంపాదించుకుందంతా పొగొట్టుకున్నాను. కానీ నాకు సినిమా మీద ప్యాషన్ ఉండడంతో నేనేం బాధ పడలేదు.

పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమాలో నటించే స్టార్స్ కొరకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అదే చిన్న సినిమా తీస్తే దాన్ని ఓటీటీలో చూడడానికి అలవాటు పడ్డారు. అయితే ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడడానికి థియేటర్స్‌కు రావాలంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉండాలి. అందుకే ఈసారి యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసేటటువంటి కమర్షియల్ సినిమా తీయాలని ఫ్రెండ్స్‌తో కలసి మంచి రొమాంటిక్ యూత్ ఫుల్ సబ్జెక్ట్ తీశాం. ఇందులో డ్రైవర్‌గా పని చేసే హీరో ఓక స్టార్ హోటల్‌లో నాలుగు  రోజులు ఉండే పరిస్థితి వస్తుంది. అక్కడే తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే "రాజయోగం" అంటే ఒక వజ్రం కోసం జరిగే వేట. ఆ వజ్రం ఎవరికీ దొరికింది? ఆ రాజయోగం ఎవరికీ వరించింది? అనేదే కథ.

ఇందులో హీరో సాయి రోనక్ చాలా బాగా నటించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ కేరళలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. హీరోయిన్‌గా చాలా మందిని అనుకున్నాము. అయితే ఎవరికి కథ చెప్పినా ఎక్కువ ముద్దు సీన్స్  ఉన్నాయని చేయడానికి ముందుకు రాలేదు. చివరకు అంకిత సాహా, బిస్మి నాస్‌లు ఈ సినిమా ఒప్పుకుని చాలా చక్కగా నటించారు. ఇందులో రొమాన్స్, ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నా  కూడా అశ్లీలంగా ఉండదు' అని ముగించారు.

చదవండి: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. ఒంటిపై గాయాలు: పోస్ట్‌మార్టమ్‌ సిబ్బంది
తప్పతాగిన స్టార్‌ హీరో కూతురు, నెట్టింట ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement