Sai Ronak's Raajah Yogam Movie OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

Raajah Yogam: ఓటీటీలో నవ్వులు పూయించనున్న రాజయోగం.. స్ట్రీమింగ్‌ అప్పుడే!

Published Thu, Feb 2 2023 3:49 PM | Last Updated on Thu, Feb 2 2023 4:32 PM

Sai Ronak, Ankita Saha Starrer Raajah Yogam OTT Release Date Out - Sakshi

వజ్రాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు

సాయి రోనక్‌, అంకిత సాహా, బిస్మి నాస్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రాజయోగం. ఈ చిత్రంతో రామ్‌ గణపతి దర్శకుడిగా పరిచయమయ్యాడు. డిసెంబర్‌ 30న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ఈ సినిమాను శ్రీ నవబాలా క్రియేషన్స్‌, వైష్ణవి నటరాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై మణిలక్ష్మణ్‌ రావు నిర్మించారు.

కథ విషయానికి వస్తే..
మధ్య తరగతి కుర్రాడు రిషి(సాయి రోనక్‌) మెకానిక్‌గా పని చేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఓసారి తను రిపేర్‌ చేసిన కారును ఓనర్‌కు ఇచ్చేందుకు స్టార్‌ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)తో లవ్‌లో పడతాడు. ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే డేనియల్‌ దగ్గరున్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్‌ ఘోష్‌) గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. రాధా, డేనియల్‌ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? అసలు రిషి, శ్రీ కలుసుకున్నారా? లేదా? అనేదే కథ.

చదవండి: మేకప్‌ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement